IPL 2025లో భాగంగా చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
🚨 News from New Chandigarh 🚨@PunjabKingsIPL won the toss and elected to bat against @ChennaiIPL in Match 2⃣2⃣
Updates ▶️ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/6o3ZWXsnI6
— IndianPremierLeague (@IPL) April 8, 2025
కాగా ఈ మ్యాచులో రెండు జట్లు గత మ్యాచులో ఆడిన టీమ్‌లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకూ పంజాబ్ 3 మ్యాచులు ఆడి రెండింట్లో నెగ్గింది. అటు చెన్నై నాలుగు మ్యాచులు ఆడి రెండింట్లో ఓడి, మరో రెండు గెలిచింది. దీంతో ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుకు వేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(WK), శ్రేయస్ అయ్యర్(C), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్(Maxwell), మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(C), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(WK), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ






