IPL 18వ సీజన్‌లో పరుగుల మోత మోగుతోంది. దాదాపు అన్ని జట్లు ధనాధన్ ఆటతో అలరిస్తున్నాయి. బ్యాటర్లు మొదటి నుంచే బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఎటాకింగ్‌కు దిగుతున్నారు. నిన్న పంజాబ్ కింగ్స్(PBKS) వర్సెస్ గుజరాత్ టైటాన్స్(GT) మ్యాచులోనూ ఇదే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్.. బ్యాటర్ల వీరవిహారంతో 243 భారీ స్కోరు సాధించింది. అటు ఛేదనలోనూ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి కేవలం 11 పరుగులతో ఓడింది. ఇలాంటి హైస్కోరింగ్ గేమ్ వల్ల రానున్న మ్యాచులపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరగడం ఖాయం.
అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో
ఇక పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయ్యర్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో సెంచరీ సాధించే అవకాశం చేజారింది. పవర్ గేమ్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అయ్యర్, భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను హడలెత్తించాడు. మరో ఎండ్‌లో శశాంక్ సింగ్(Sheshank Singh) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 44) పరుగులు చేశాడు.
No Sympathy
No PR
No Comeback Ads
No Crying in Interviews
No Fitness issue
No Excuses
No Failure coverups
No Statpading
Just pure performance and dedication for the team.
That’s Shreyas lyer for you 🦁❤️#GTvsPBKS #ShreyasIyerpic.twitter.com/yFdHtOagM8— TushaRR (@__jaisball) March 25, 2025
పోరాడి ఓడిన టైటాన్స్
ఆరంభంలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(Priyansh Arya) దూకుడుగా ఆడి (23 బంతుల్లో47) పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్(GT) బౌలర్లలో సాయి కిశోర్ 3, రబాడ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. 244 భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54), రూథర్ ఫర్డ్ (46) పోరాడినప్పటకీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, యాన్సన్, మాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు. ఇక ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో కేకేఆర్ తలపడనుంది. రాత్రి 7.30కి గువహటిలో మ్యాచ్ జరుగుతుంది.







