ఐపీఎల్ 2025లో ఆర్సీబీ మళ్లీ అదే కథ. సొంతగడ్డపై ఆ జట్టు మరోసారి చతికిలబడింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ RCBని 5 వికెట్లతో చిత్తు చేసింది. PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్(DC) పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకగా.. RCB 4వ స్థానానికి పడిపోయింది.
#CricketWithTOI | #PunjabKings beat #RoyalChallengersBengaluru by 5 wickets as #NehalWadhera stands tall with an unbeaten 33 from 19 balls .
This is third straight home defeat for #RCB this season.
Highlights 🔗https://t.co/SAgygwUj1l#IPL2025 #RCBvsPBKS #PBKSvsRCB pic.twitter.com/K2f3gXOgBB
— The Times Of India (@timesofindia) April 18, 2025
సగం ఆట వరుణుడే ఆడేశాడు..
వరుణుడు ఆటంకం కలిగించిన ఈ మ్యాచులో ఓవర్లను కుదించారు. ఇరు జట్లకు చెరో 14 ఓవర్లు కేటాయించారు. దీంతో వర్షం తగ్గాక టాస్ నెగ్గిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. వాన పడటం, పిచ్ కవర్లతో మూసి ఉంచడం ఆ జట్టు బౌలర్లకు కలిసొచ్చింది. దీంతో బెంగళూరు బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఆర్సీబీలో సాల్ట్ 4, కోహ్లీ 1, పాటీదార్ 23, లివింస్టోన్ 4, జితేశ్ 2, పాండ్య 1, మనోజ్ 1, భువనేశ్వర్ 8, దయాల్ 0, హేజిల్ వుడ్ (0*) తీవ్రంగా నిరాశపర్చారు. చివర్లో టిమ్ డేవిడ్ (50*) సూపర్ ఫిఫ్టీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 95/9 స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జాన్సెన్, చాహల్, హర్ప్రీత్ తలో 2 వికెట్లు తీయగా.. బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.
వధేరా వధించేశాడు..
అనంతరం 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ప్రియాన్ష్ 16, ప్రభ్ సిమ్రన్ 13, శ్రేయస్ 7, ఇంగ్లిస్ 14, వధేరా 33, శశాంక్ 1, స్టొయినిస్ 7 పరుగులు చేసి విజయం అందించారు. దీంతో 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. కాగా ఇవాళ ఐపీఎల్‌లో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30కి GTతో ఢిల్లీ.. రాత్రి 7.30కి జైపూర్‌లో రాజస్థాన్‌తో లక్నో తలపడనున్నాయి.







