RCB vs PBKS: ఎట్టకేలకు తగ్గిన వర్షం.. తొలి ఓవర్లనే ఆర్సీబీకి షాక్

ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షం వల్ల టాస్ దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో 14 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయించారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటికే వర్షం వల్ల టాస్‌కు అంతరాయం కలగగా.. ఈ మ్యాచ్ పూర్తయ్యేలోపు మళ్లీ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

కాగా టాస్ బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తొలి ఓవర్లలోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో సాల్ట్ (4) రన్స్ చేసి ఔట్ అయ్యాడు. కాగా ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు చెరో 6 మ్యాచులు ఆడి చెరో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు 2వ స్థానానికి ఎగబాకుతుంది. కాగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచులు జరిగాయి. అందులో 16 మ్యాచుల్లో ఆర్సీబీ, 17 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించాయి.

తుది జట్లు ఇవే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (w), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *