Fahad Fasil: ఏంటి బ్రో ఇదీ.. ఫహద్ ఫాసిల్-నజ్రియా డైవర్స్ అంటూ వార్తలు!

ఫహద్ ఫాసిల్(Fahad Fasil).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళ నటుడుగా ఎన్నో అద్భుతమైన మూవీలలో నటించిన ఈయన తెలుగులో పుష్ప సినిమా(Pushpa Movie) ద్వారా టాలీవుడ్ అభిమానుల(Tollywood Fans)ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షేఖావత్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో కూడా మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఇతడు నటి నజ్రియా(Nazriya Nazim)ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

Nazriya Nazim Opens Up About Fahadh Faasil's ADHD; Know How To Support Partners With This Disorder - News18

ఇన్‌స్టా వేదికగా పోస్టు

అయితే ఎంతో అనోన్యంగా ఉన్న ఈ కపుల్స్ మధ్య క్లాషెస్ వచ్చాయని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు(Divorce) తీసుకోబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు. తాజాగా నటి నజ్రియా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పలు(Social Media Posts) సందేహాలకు మరింత బలం చేకూర్చింది. నజ్రియా నాలుగు నెలలకు పైగా కనిపించకపోవడంపై ఇన్‌స్టాగ్రామ్‌(Insta)లో క్షమాపణ చెబుతూ ఒక పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు..

‘‘గత కొన్ని నెలలుగా మానసికం(Mentally)గా బాగాలేను. వ్యక్తిగత సమస్యలు(Personal Problems) ఎదుర్కొన్నాను. నా 30వ పుట్టినరోజు, కొత్త సంవత్సరం, ‘కొత్త సినిమా’ విజయాన్ని మీతో పంచుకోలేకపోయాను. నేను SMలో కూడా యాక్టివ్‌గా లేను. ఫ్రెండ్స్ కాల్స్‌కు కూడా స్పందించలేకపోయా.. నన్ను కలవడానికి ప్రయత్నించిన నా స్నేహితులందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇది కఠినమైన ప్రయాణం. ప్రతిరోజూ నేను మెరుగవుతున్నాను. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అంటూ నజ్రియా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. అయితే ఈ పోస్టులో ఎక్కడ కూడా తన భర్త గురించి ఈమె ప్రస్తావన చేయలేదు. దీంతోనే వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయన్న వార్తలు వస్తున్నాయి. మరీ ఈ న్యూస్ పై వీరిద్దరూ స్పందించాల్సి ఉంది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *