తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పడి లేచిన కెరటం అనే మాట డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh)కు కరెక్టుగా సూటవుతుంది. ఒకప్పుడు ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోలు క్యూ కట్టేవారు. చాలా మంది నటులకు ఆయన సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఆయనతో సినిమా అంటే చాలా మంది నటులు వెనకడుగేస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాలతో డిజాస్టర్లు మూటగట్టుకున్నారు పూరి.
పవర్ ఫుల్ పాత్రలో మాలీవుడ్ స్టార్
అందుకే ఆయన ప్రస్తుతం తమిళ నటుడితో సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో పూరి ఓ ప్రాజెక్టు రెడీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కథానాయికలు టబు, రాధిక ఆప్టే (Radhika Apte) కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో మాలీవుడ్ స్టార్ నటుడు ఓ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇంతకీ ఆయన ఎవరో కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఫహాద్ ఫాజిల్.

ఫహాద్ ఓకే చెప్పినట్టేనా?
ఈ మూవీలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందట. అందుకే ఈ పాత్రకు ఎవరైతే బాగా సూట్ అవుతారో ఆలోచించి చివరకు ఫహాద్ (Fahadh Faasil) ను తీసుకునేందుకు ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ఆయనకు కథ కూడా వినిపించారని సమాచారం. ఆయనకు కథ కూడా నచ్చిందట. పుష్పతో వచ్చిన క్రేజ్ తో ఫహాద్ ప్రస్తుతం ఫుల్ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట. దీంతో పూరి ఫహాద్ క్యాల్షీట్స్ ఖాళీ అయ్యే వరకు ఎదురుచూస్తారా..? లేదా వేరే నటుడిని వెతుక్కుంటారా..? అన్నది చూడాలి.






