Mana Enadu : పుష్ఫ 2 మూవీ (Pushpa 2) సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న ఈ మూవీ విడుదలకు ముందస్తు బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తూ అంచనాలు దాటి ముందుకెళ్లిపోతుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే టికెట్లు వేగంగా అమ్ముడుపోయాయి.
బుకింగ్స్ ప్రారంభం కాక ముందు ‘బుక్ మై షో’లో 1+ మిలియన్, (Book my show) ‘పేటీఎం’లో (Paytm)1.3+ మిలియన్ హిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో లైక్ రావడం ఇదే మొదటి సారి. పుష్ఫ 2 మూవీ 80 దేశాల్లో, 6 భాషల్లో, 12 వేలకు పై స్క్రీన్స్ లలో డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇలా ఇన్ని థియేటర్లలో విడుదల కానున్న పాన్ ఇండియా తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. 7 ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా డైరెక్టర్ సుకుమార్ (Sukumar) అల్లు అర్జున్ (allu arjun) ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల నుంచి కష్టపడ్డారు.
బెనిఫిట్ షో రేట్లు అభిమాన సంఘాలకు మాత్రమే
బుకింగ్స్ లో దూసుకుపోతున్న పుష్ఫ 2కు కోర్టులో సినిమా విడుదల ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా దీనిపై విచారణ జరగ్గా.. బెనిఫిట్ షో (Benefit Show) పేరుతో ఒక్కో టికెట్ కు అదనంగా రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ 15 రోజులు కూడా సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారని అన్నారు. దీనిపై నిర్మాత తరపు న్యాయవాది స్పందిస్తూ.. బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని చెప్పారు. అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి (judge) వాయిదా వేశారు.
పిటిషనర్ కు జరిమానా..
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తీసిన ‘పుష్ప 2’ విడుదలను నిలిపివేయాలంటూ శ్రీశైలం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు (Censor Board) తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించి.. మార్పులు తర్వాతే సినిమా విడుదలకు అనుమతించామని తెలిపారు. దీంతో హైకోర్టు(High Court) స్పందిస్తూ ఊహాజనిత ఆరోపణల ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని తేల్చి చెప్పింది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్ కు జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని సూచించింది.






