పుష్పరాజ్ ర్యాంపేజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)  హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2). రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లలోనూ రికార్డు సృష్టించింది. డిసెంబర్‌ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన ‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

ఫస్ట్ డే రూ.175 కోట్లు

అయితే తొలిరోజు పుష్పరాజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేశాడని ట్రేడ్‌ వర్గాల అంచనా(Pushpa 2 First Day Collection). ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే అధిక కలెక్షన్లు ఉన్నట్లు సమాచారం.  ఇక అమెరికాలో ఫస్ట్ డే దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. అగ్రరాజ్యంలో ఈ రేంజులో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ‘పుష్ప 2’ అని తెలిపింది.

కల్కి రికార్డు బ్రేక్ చేసిన పుష్పరాజ్

మరోవైపు ప్రీ సేల్‌ బుకింగ్స్‌ నుంచే బుక్‌ మై షోలో దూసుకుపోతోన్న ‘పుష్ప 2’ టికెట్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడుపోయాయి. గతంలో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)’ సినిమా గంటలో 97,700 టికెట్స్‌తో టాప్‌లో ఉండగా పుష్పరాజ్ ఆ మార్క్‌ను పుష్పరాజ్‌ దాటేసి సరికొత్త రికార్డు లిఖించాడు. 

ఇక పుష్ప-2 సినిమా సంగతికి వస్తే ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మెరిశాడు. రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటించగా సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, జగదీశ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీలీల స్పెషల్ సాంగులో తళుక్కుమని మెరిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *