The Raja Saab : 17 ఏళ్ల తర్వాత ఆ బ్యూటీతో ప్రభాస్ స్టెప్పులు!

Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లైనప్ లో దాదాపు అరడజను సినిమాలున్నాయి. అందులో ముందుగా ఆయన మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్ (The Raja Saab)’ షూటింగులో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాదాపుగా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..?

ప్రభాస్ తో లేడీ సూపర్ స్టార్

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగులో ప్రభాస్ తో ఓ స్టార్ హీరోయిన్ స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయంపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆ స్టార్ బ్యూటీ ఎవరో కాదని.. ఏకంగా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)తో ప్రభాస్ స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని ఇప్పటికే నయన్ ను మేకర్స్ అప్రోచ్ అవ్వగా ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

17 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్

ఇదే జరిగితే ప్రభాస్-నయనతార కలిసి దాదాపు 17 ఏళ్ల తర్వాత వెండితెరపై కలిసి కనిపించబోతున్నట్టు. 2007లో ‘యోగి (Prabhas Yogi)’ సినిమాలో ఈ జంట కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ది రాజా సాబ్ తో మరోసారి తెరపై కనువిందు చేయనున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది నిజమైతే బాగుంటుందని మేకర్స్ రిక్వెస్టు పెడుతున్నారు. అయితే రాజాసాబ్ లో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ వచ్చే నెలలో జరిగే అవకాశం ఉందని సమాచారం. 

https://www.youtube.com/watch?v=fPLzesuwNxg 

రాజాసాబ్ లో ముగ్గురు భామలు

ది రాజా సాబ్ సినిమా సంగతికి వస్తే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు భామలు హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. మలయాళ కుట్టి మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇందులో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *