#RAPO22 Update : రామ్ ‘సాగర్’ సడన్ సర్ ప్రైజ్

Mana Enadu :  ‘పతా హై మై కౌన్ హూ.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’.. అంటూ మొన్నటిదాక ఊరమాస్ గా కనిపించిన రామ్ పోతినేని (Ram Pothineni) మళ్లీ రూటు మార్చాడు. మాస్ క్యారెక్టర్లలో ప్రేక్షకులు తనను మెచ్చినా.. తనలోని అసలైన్ లవర్ బాయ్ ను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ రూట్ మార్చి తన కంఫర్ట్ జానర్ లోకి వచ్చేశాడు రామ్. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. 

‘సాగర్’గా రామ్

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు పి. మహేశ్ బాబు (P. Mahesh Babu)తో రామ్ తన తదుపరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #RAPO22 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ ‘సాగర్’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఇవాళ్టి నుంచి షూటింగు ప్రారంభమైనట్లు కూడా అప్డేట్ ఇచ్చారు.

‘లవర్ బాయ్’గా రామ్

ఇక మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ లో రామ్ (Ram Latest Movie) కాలేజ్ కుర్రాడిలా కనిపించాడు. ఈ పోస్టర్ చూసి మన పాత రామ్ మళ్లీ వచ్చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత రామ్ ను చాక్లెట్ బాయ్ అవతార్ లో చూడబోతున్నామని ఖుష్ అవుతున్నారు. ఈ పోస్టర్ లో రామ్.. పాతకాలపు సైకిల్‌ ముందు అలా కాలు గాల్లోకి లేపుతూ హాయిగా నవ్వుతున్న ఓ లుక్ ఇచ్చాడు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో

ఇక ఈ సినిమా సంగతికి వస్తే రామ్ (Ram Mahesh Babu Movie) తో పాటు ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మధు నీలకందన్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఇక  ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో హిట్ కొట్టిన మహేశ్ బాబు రామ్ తో కలిసి నెక్స్ట్ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ణానికి సిద్ధమవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *