ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్మార్ట్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కాంబోలో వచ్చిన మూవీ పుష్ప-2(Pushpa2). ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ నార్త్ ఇండియాలో సక్సెస్ ఫుల్‌గా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా భారతీయ సినిమా రికార్డులను తిరగరాసేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1850 కోట్లకుపైగా కలెక్షన్లు(Collections) రాబట్టిన ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా.. జగపతిబాబు, సునీల్, ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్
పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్(Digital streaming) అవుతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను OTT దిగ్గజం Netflix భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని నెట్టింట వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో త్వరలోనే ఈ మూవీ OTTలోకి వచ్చేస్తోందని టాక్. నెల 28 లేదా 31న Netflixలో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై తెలంగాణలో ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.







