Pushpa-2: ఇట్స్ అఫీషియల్.. పుష్ప2 రెండోరోజు కలెక్షన్స్​ ఎంతో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. కళ్లు చెదిరిపోయే కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తోంది. పుష్ప.. ఈసారి వైల్డ్ ఫైర్ అంటూ వచ్చిన పుష్పరాజ్.. ర్యాంపేజ్ అన్నిరాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవైపు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే.. మరోవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా.. సుకుమార్ డెరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై హిస్టరీ క్రియేట్ సృష్టిస్తోంది.

రెండోరోజు వసూళ్లను ప్రకటించిన మైత్రీ మూవీస్

ఈ క్రమంలోనే పుష్ప-2 రెండో రోజు కలెక్షన్లు (Pushpa 2 Day 2 Collections) ఇంతా.. అంతా అంటూ ఇప్పటిదాకా రకరకాల లెక్కలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా రెండో రోజు వసూళ్లను ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో మరో తెలుగు సినిమా రికార్డు సృష్టించిందని తెలిపింది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రెండు రోజుల్లో అత్యధికంగా ‘పుష్ప2: ది రూల్‌’ (pushpa 2 the rule) ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్లు (Pushpa 2 First Day Collections) వసూల్ చేసినట్లు ప్రకటించింది.

హిందీలోనూ రికార్డులు బద్దలు

పుష్ప 2 సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటివరకు అతిపెద్ద ఓపెనింగ్ గల భారతదేశ సినిమాలైన RRR, Bahubali-2 రికార్డులను పుష్ప 2 మూవీ బ్రేక్ చేసింది. అలాగే హిందీ(Hindi Collections)లో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ కొట్టింది. హిందీలో మొదటి రోజు రూ.72 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *