పుష్ప-2(Pushpa-2) టికెట్ రేట్లు పెంచుకునేందుకు సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Telangana & AP Govt) ప్రభుత్వాలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ధన్యవాదాలు(Thanks) తెలిపారు. పుష్ప-2 సక్సెస్ మీట్‌ను ఇవాళ హైదరాబాద్(HYD)లో నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడారు. మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి ముఖ్యకారణం డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) అని చెప్పారు. తమపై నమ్మకంతో సినిమాను నిర్మించిన నిర్మాతల(Producers)కు బన్నీ(Bunny) థ్యాంక్స్ తెలిపారు. నా నటనను ఎంత పొగిడినా అదంతా డిజైన్ చేసేంది సుకుమార్ గారేనని అన్నారు. పుష్ప సీక్వెల్స్‌తో తనను పై స్థాయిలో కూర్చొబెట్టారని అల్లు అర్జున్ అన్నారు. తాను అహంకారంతో ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. ఇక ‘పుష్పరాజ్’పై అభిమానం, ప్రేమను వెలకట్టలేమని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ధన్యవాదాలు
ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు రేట్లు పెంచుకోనిచ్చిన ముఖ్యమంత్రులకు థాంక్స్ చెప్పాడు. ‘నేను తెలంగాణ ప్రభుత్వానికి, CM రేవంత్ రెడ్డికి థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ హైక్ ఇచ్చినందుకు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సపోర్టు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణలో ఎంత రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారో అలాగే ఆంధ్రప్రదేశ్(AP)లో కూడా మమ్మల్ని సపోర్ట్(Support) చేయడానికి అంతే పెంచుకునే అవకాశం ఇచ్చారు. దీనికి AP ప్రభుత్వానికి, CM నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. ఈ స్పెషల్ G.O పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే పర్సనల్‌గా ‘‘కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ’’ అంటూ బన్నీ స్పీచ్ ఇచ్చాడు.
ఆ కుటుంబానికి అండగా ఉంటాం
ఇక హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandya Theatre Issue) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మరణించడంపై అల్లు అర్జున్ మరోసారి స్పందించారు. ‘గత 20 ఏళ్లుగా నేను ఆ థియేటర్‌కు వెళ్తున్నాను. మొన్న సినిమా చూస్తుండగా మా మేనేజర్ వచ్చి బయట గందరగోళంగా ఉంది.. వెళ్లిపోమని చెప్పారు. ఆ తర్వాతి రోజు ఈ ఘటన గురించి తెలిసింది. ఆ షాక్‌లో వెంటనే స్పందించలేకపోయాను. ఆమె కుటుంబానికి సారీ చెబుతున్నా. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’ అని చెప్పారు.






