పాలిటిక్స్‌లో బిజీగా గడుపుతూనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన హరహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఇదిలాఉండగా ప్రస్తుతం ఆయన గబ్బర్‌సింగ్‌తో భారీ హిట్ అందించిన హరీశ్ శంకర్ (Harish Shankar)తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో (Ustaad Bhagat Singh) నటిస్తున్నారు. ఇందులో పవన్ సరసన తెలుగు బ్యూటీ శ్రీలీల ఆడిపాడనుంది. తాజాగా మరో హీరోయిన్ను కూడా తీసుకున్నట్లు తెలుపుతూ మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

‘శ్లోక’ అనే రోల్లో కనిపించనున్న బ్యూటీ
ఈ సినిమాలో నటి రాశీ ఖన్నా (Raashi Khanna) భాగమైనట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్నే దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. రాశీ ఖన్నా ‘శ్లోక’ అనే రోల్లో కనిపించనున్నట్లు వెల్లడించారు. తన క్యారెక్టర్‌తో సినిమాకు మరింత అందాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె షూటింగ్లో పాల్గొంటోందని తెలిపారు. హరహర వీరమల్లు మొదటి భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్లో పాల్గొంటున్నారు.
Welcoming
The Angelic #Rashikhanna on Board as “Shloka”In the Part of #UsthadBhagatSingh#UstadBhagatSingh #Pawanakalyan #rashikhanna pic.twitter.com/JB815QlYFJ
— T World Media (@t_world_media) July 22, 2025






