
హీరో నితిన్(Nitin), అందాల భామ శ్రీలీల(Sreelaala) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్(Rabinhood). చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ మీద అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ అంచనాలను హైప్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన కేతిక శర్మ(Kethika Sharma) ఐటెం సాంగ్ కుర్రకారును తెగ ఆకట్టుకునేలా చేస్తోంది. శేఖర్ మాస్టర్(Shekar Master) కొరియోగ్రఫీ మీద విమర్శలు వినిపిస్తున్నా సాంగ్ బాగుండడంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు.
అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి నితిన్ కెరీర్‌లోనే అత్యంత హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్(Highest Non-Theatrical Business) జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా OTT రైట్స్ ZEE5 సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు దక్కించుకుంది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు తెలుగు రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే..
ఇక హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాత దగ్గరే ఉన్నాయని చెబుతున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే వాటిని కూడా ZEE5 సంస్థ మంచి రేటుకి కొనుగోలు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద భారీ హిట్ అందుకుంటుందా? లేదా? తెలియాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే.