
రైలు ప్రయాణికులకు కేంద్రం(Central Govt) షాకివ్వబోతోందా అంటే.. అవుననే తెలుస్తోంది. రైలు టికెట్ ధరల పెంపు(Train ticket price hike)పై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న(Union Minister of State for Railways V. Somanna) వ్యాఖ్యలతో ఇది స్పష్టమైంది. తాజాగా ట్రైన్ టికెట్ రేట్ల హైక్‌పై ఆయన స్పందించారు. ప్రయాణికులపై ప్రభావం పడకుండా దశలవారీగా రైల్వే ఛార్జీ(Railway fares)లను పెంచుతామని తెలిపారు. ఛార్జీలలో క్రమంగా పెరుగుదల ఉండొచ్చనే సంకేతాలిచ్చిన ఆయన.. దీనిపై చర్చ జరుగుతోందని, దశలవారీగా పెంచనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే, చెన్నైకి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం(Greenfield Airport) ప్రతిపాదించిన నేపథ్యంలో పరందూర్‌లో రైల్వే స్టేషన్(Railway station in Parandur) నిర్మాణం చేపట్టే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం వాటిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
టికెట్ ధరలపై రైల్వేశాఖ కసరత్తు
ఇదిలా ఉండగా రైల్వే టికెట్ ధరలు(Railway ticket rates) స్వల్పంగా పెంచేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తోందని.. ఈ పెంపు జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, AC తరగతులపై కి.మీ.కు 2 పైసల చొప్పున పెంచవచ్చని ఆ వార్తల సారాంశం. కాగా 2013, 2020లలో చేసిన సవరణలతో పోలిస్తే ఈసారి పెంపు నామమాత్రమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా టికెట్ రేటు ఎంత మేరకు పెంచుతారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Union Minister of State V Somanna proposed a new railway station near the proposed Parandur Airport site…#Parandur #Airport 🏗️✈️ https://t.co/bfYvGxSSNB
— Chennai Updates (@UpdatesChennai) June 27, 2025