IPLలో సంచలన ఇన్నింగ్స్‌తో 14 ఏళ్ల పిల్లాడు విధ్వంసం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సైతం తుత్తునియలు చేస్తూ విరోచిత సెంచరీ బాదాడు. అతడి పవర్ హిట్టింగ్‌కి 210 పరుగుల లక్ష్యం సైతం చిన్నబోయింది. వైభస్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై రాజస్థాయన్ రాయల్స్(RR) గ్రాండ్ విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్‌ను కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఏకపక్షం అనుకున్న ఈ మ్యాచులో వైభవ్ ఇన్నింగ్స్ అభిమానులకు ఫుల్ మాజానిచ్చింది.
शानदार, जबरदस्त, जिंदाबाद वैभव#vaibhavsuryavanshi #IPL2025 pic.twitter.com/aetk6PpjmM
— Hemant Soren (@HemantSorenJMM) April 28, 2025
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 భారీ స్కోరును నమోదు చేసింది. సాయి సుదర్శన్ (39) ఫామ్ కొనసాగించగా, కెప్టెన్ గిల్ (50 బంతుల్లో 84) పరుగుల వరద పారించాడు. ఇక ఆ తర్వాత బట్లర్ (50) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో తీక్షణ 2, ఆర్చర్, సందీప్ చెరోవికెట్ తీశారు.
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన RR ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్, గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ 14 ఏళ్ల వైభవ్ కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్(Jaipur)లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు వేదికైంది.
కేవలం 17 బంతుల్లోనే..
కేవలం 17 బంతుల్లోనే IPLలో తన తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న ఈ యువ సంచలనం, అదే ఊపును కొనసాగించాడు. ముఖ్యంగా గుజరాత్ బౌలర్ కరీం జనత్(Kareem Janath) వేసిన ఒక ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని అందుకుని, ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 38 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు.
మరోఓపెనర్ యశస్వీ జైస్వాల్ (70), కెప్టెన్ రియాన్ పరాగ్ (32*) అదరగొట్టారు. ముఖ్యంగా సూర్యవంశి, జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 166 పరుగులు జోడించడం విశేషం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. సూపర్ సెంచరీ చేసిన వైభవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.






