సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్ రావడంతోనే భారీ హైప్ నెలకొంది.
ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు(August) 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ఇంకా 50 రోజులే మిగిలి ఉండటంతో చిత్ర బృందం వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్‌కు విశేష స్పందన లభించింది.
ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిర్ షబీన్, శ్రుతిహాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇక ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. అయితే హిందీ(Hindi Title) వర్షన్ విషయంలో మాత్రం ఆసక్తికర మార్పు చేశారు. అక్కడ ‘కూలీ’ అనే టైటిల్‌కి బదులుగా ‘మజదూర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఇందుకు ప్రధాన కారణం – హిందీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ మూవీ ‘కూలీ’ (1983) ఉండట







