
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ(Coolie)’ సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రజినీ 171వ ప్రాజెక్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ‘కూలీ’ యాక్షన్ డ్రామాగా, సమాజంలోని కొన్ని కీలక అంశాలను స్పృశిస్తూ రజినీ స్టైల్‌లో హై ఓల్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది. ఈ చిత్రంలో రజినీకాంత్ ఒక కూలీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో రజినీ పాత్రలో డెప్త్, లోకేష్ మార్క్ ట్విస్ట్‌లు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ (LCU) తరహాలో కథను నడిపే అవకాశం ఉందని, కానీ ‘కూలీ’ స్వతంత్ర చిత్రంగా ఉంటుందని సమాచారం.
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
ఈ సినిమాలో స్టార్స్ ఉపేంద్ర(Upendra), ఆమిర్ ఖాన్, నాగార్జున(Nagarjuna), సాబిన్ షాహిర్, సత్యరాజ్, శృతిహాసన్(Shruti Haasan), పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్(Promotions) స్టార్ట్ చేసిన చిత్రబృందం.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ‘కూలీ’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్‌కార్డ్ వేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer) ఆగస్టు-2న రానుందని మేకర్స్ ప్రకటించారు.
ഈ പടം Leo records ഒക്കെ തൂക്കാൻ ചാൻസ് ഉണ്ടോ…?#Coolie Telugu State 100+Cr Gross Expecting because of Nagarjuna
TN..?
Karnataka..?
Kerala..?
Hindi Dubb…?#Rajanikanth #NagarjunaAkkineni #AamirKhan pic.twitter.com/XTYYEqB09C— Leo Messi (@leomessi9622) July 29, 2025