సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth)నటిస్తున్న కూలీ(Coolie)చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్(Advance bookings)లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్(Sun Pictures)!నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్ యాక్షన్‌తో కూడిన స్టైలిష్ రోల్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కాంబినేషన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
మొదటి రోజు షోలు దాదాపు హౌస్‌ఫుల్
తెలుగు రాష్ట్రాల్లో కూలీ టికెట్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి రోజు షోలు దాదాపు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) కోసం అభిమానులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషో, పేటీఎంలలో టికెట్ల కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుండగా, లోకేష్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంచనా. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది.
రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం!
సినిమా రిలీజ్ (ఆగస్టు 14)కు 3 రోజులు మిగిలి ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ స్థాయి కలెక్షన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. సోషల్ మీడియాలో #CoolieFever ట్రెండ్‌తో అభిమానులు సినిమా హైప్‌ను ఆకాశానికి తాకేలా చేస్తున్నారు. కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌తో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.






