సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్(Censor board) బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే పరిమితం. లోకేష్ సినిమాల్లో సాధారణంగా ఉండే తీవ్రమైన వైలెన్స్ ఈ సర్టిఫికెట్‌కు కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్తతో రజినీ ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే కొందరు షాక్‌కు గురవుతున్నారు.
#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K
— Sun Pictures (@sunpictures) August 1, 2025
రూ.400 కోట్ల బడ్జెట్‌తో..
ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున(Nagarjuna) విలన్ పాత్రలో, ఉపేంద్ర(Upendra), శృతి హాసన్, సౌబిన్ షబీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Amir Khan) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, పవర్‌హౌస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రజినీ రెమ్యూనరేషన్‌గా 260 కోట్లు, నాగార్జునకు 24 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అమెజాన్ డెలివరీ బాక్స్‌లపై ప్రమోషన్స్ వంటి వినూత్న వ్యూహాలతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. ఆగస్టు 2న ట్రైలర్(Trailer) విడుదల కానుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై హైప్‌ను పెంచగా, నేడు రిలీజయ్యే ట్రైలర్ అంచనాలను మరింత పెంచుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.







