Mana Enadu: బాలీవుడ్ ఇండస్ట్రీలో 2003లో వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్(Munna Bhai MBBS)’ బాక్సాఫీస్(Boxoffice) వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. సంజయ్ దత్(Sanjay Dutt) హీరోగా ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Director Rajkumar Hirani) తెరెక్కించిన ఈ మూవీని చూసేందుకు అప్పట్లో ప్రేక్షకులు(Fans) థియేటర్లకు పోటెత్తారు. దానికి రిలేటెడ్‌గా వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్(Lageraho Munnabhai)’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయ. టాలీవుడ్‌లోనూ ఇవి సూపర్ హిట్ దక్కించుకున్నాయి. అయితే ‘మున్నాభాయ-3(Munnabhai-3)’పై ఇండస్ట్రీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ‘మున్నాభాయ్’ ఫ్రాంచైజీని తీసుకురావాలని సినీ అభిమానులు కోరుతున్నారు. కానీ అది ఇంతవరకూ సాధ్యపడలేదు. దీనిపై ఏనాడు రాజ్ కుమార్ హిరానీ కూడా స్పందించలేదు. సినిమాను తీస్తానని గానీ, తీయనని గానీ చెప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ 3’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మున్నాభాయ్ 3’ స్క్రిప్ట్ రెడీ అవుతోంది: హిరానీ
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘మున్నాభాయ్ 3’ గురించి రాజ్ కుమార్ హిరానీ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ‘మున్నాభాయ్ 3’ తన టాప్ ప్రియారిటీలో ఉన్నట్లు చెప్పారు. “’మున్నాభాయ్ 3’ నా టాప్ ప్రియారిటీలో ఉంది. నేను ప్రస్తుతం కొన్ని స్క్రిప్టులు(Munnabhai 3 script) రెడీ చేస్తున్నాను. వాటిలో ‘మున్నాభాయ్ 3’ కూడా ఒకటి. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. అయినా, కష్టపడుతున్నాను. రాయడానికి ప్రయత్నిస్తున్నాను. సంజు(Sanjay Dutt) కూడా మూడో భాగాన్ని తీయాలని కోరుతున్నారు. నా దగ్గర ప్రస్తుతం ‘మున్నాభాయ్ 3’కి సంబంధించి కంప్లీట్ కాని స్క్రిప్ట్ ఉంది. దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా తెలుగులో ఈ రెండు సినిమాలను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీమేక్ చేశారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా ‘శంకర్‌దాదా MBBS’ పేరుతో విడుదల కాగా, ‘లగేరహో మున్నాభాయ్’ మూవీని ‘శంకర్‌దాదా జిందాబాద్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ అందించారు. ఈ రెండు మూవీల్లో చిరుకి అసిస్టెంట్‌గా శ్రీకాంత్ నటించగా.. హీరోయిన్‌గా సోనాలి బింద్రే(Sonali Bendre) యాక్ట్ చేశారు. గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, అలీ, వేణుమాధవ్ తదితరులు కీలకపాత్రల్లో మెప్పించారు.