టాలీవుడ్(Tollywood)లో ప్రస్తుతం లీకులు(Leaks) మేకర్స్‌కు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రతి సినిమా నిర్మాణ సమయంలో, ఆ చిత్రానికి సంబంధించిన వార్తలు(News), ఫొటోలు(Photos), వీడియోలు(Videos) లీక్ అవుతుండటం కామన్ అయిపోయింది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, అక్కడికి షూటింగ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు, అభిమానులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా సినిమాలకు ఎదురయ్యాయి. ఇటీవల రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ సినిమాలోని ఒక పాట(Song) కూడా ముందే లీక్ అయింది.
చెర్రీ గెటప్ కూడా రివీల్ చేయొద్దు: డైరెక్టర్
ఈ నేపథ్యంలో రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు(Director Bucchibabu) కాంబినేషన్‌లో తాజాగా రూపొందుతున్న RC16 మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతోపాటు సినిమా షూటింగ్ విశేషాలు ఎప్పటికప్పుడు SMలో వస్తుండటంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. ఇకపై సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కాకుండా చూడాలని హీరో, డైరెక్టర్ టీమ్ సభ్యులకు సూచించారట. అంతేకాదు, ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్(Ram Charan Getup) కూడా ముందుగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్(Schedule) ఈరోజు (జనవరి 29) నుంచి హైదరాబాద్(HYD)లో ప్రారంభం కానుంది.

చిత్రీకరణ సమయంలో మొబైల్ ఫోన్లు వద్దు..
ఇక షూటింగ్(Shooting)లో పాల్గొనే సిబ్బంది ఎవరూ కూడా చిత్రీకరణ సమయంలో మొబైల్ ఫోన్లు(Mobiles) ఉపయోగించకూడదని ఆదేశించారట. అంతేకాకుండా సినిమా కథ, సన్నివేశాలకు సంబంధించిన సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని షరతులు విధించారట. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నాడని సమాచారం. ఇందుకోసం ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్. జాన్వీ కపూర్(Janhvi Kapoor) నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై కిలారు సతీష్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. కాగా మహేశ్ బాబు(MaheshBabu) నటిస్తోన్న SSMB29 ప్రాజెక్టు కూడా ఇలాంటి రూల్సే పాటించాలని డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) మూవీ యూనిట్‌కు సూచించిన విషయం తెలిసిందే.








