గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) సానా కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) నటిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ వంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి రాబోతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న చెర్రీ మూవీ టైటిల్ రివీల్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. తాజాగా చెర్రీ-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కన మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥
Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025
‘RC 16’ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ని రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా ఇవాళ (మార్చి 27న) ఉదయం 9.09 గంటలకు విడుదల చేశారు. చరణ్ కొత్త మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ”గ్రామీణ ప్రాంతాల నుంచి ధైర్యం, పవర్, అపరిమితమైన స్ఫూర్తి’’ అంటూ చెర్రీ మాస్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘‘హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్’’ అంటూ పోస్టు చేశారు.









