
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ‘మెగా’ ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్‌బేస్(Fanbase) సొంత చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా ‘చిరుత’ లా సిల్వర్ స్క్రీన్‌పైకి దూసుకొచ్చాడు. ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి.. ‘ఆరెంజ్’తో అమ్మాయిల మనసు దోచేశాడు. ‘రచ్చ’తో రచ్చచేసి, ‘నాయక్’తో అభిమానుల్లో నాయకుడయ్యాడు. ‘జంజీర్’తో బాలీవుడ్‌ని టచ్ చేశాడు. ఇక ‘ఎవడు’తో తనలోని నటనకు ఎదురులేదని నిరూపించాడు. ఆ తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించాడు.
తండ్రికి తగ్గ తనయుడిగా..
ఆ తర్వాత ‘బ్రూస్ లీ’తో బూస్ట్ పొంది.. ‘ధ్రువ’తారగా నిలిచాడు. ఇక ‘రంగస్థలం’లో తనలోని నటవిశ్వరూపాన్ని చూపించాడు. ‘వినయ విధేయ రామ’తో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తన వినయాన్ని చాటాడు. ఇక ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా నిలిచాడు. ‘ఆచార్య’లో తండ్రి సరసన అద్భుతంగా నటించి.. ‘Game Changer’తో తన రాబోయే సినిమాల్లో మరిన్ని ఛేంజస్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ చేస్తున్నాడు. మొత్తంగా తండ్రికి తగ్గ తనయుడిగా, మంచి నడవడిక ఉన్న మనిషిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు. మరి గ్లోబల్ స్టార్ RAM CHARANకు ‘Mana Enadu’ తరఫున HAPPY BIRTHDAY.