2023 అక్టోబరులో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘మ్యాడ్’ (Mad). దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ మూవీలు కథానాయకులుగా నటించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ (Mad Square Trailer)ను విడుదల చేసింది. లడ్డూ గాడి పెళ్లి ముచ్చటతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. మీరూ ఈ ట్రైలర్‌ని చూసేయండి.








