Ghajini 2: త్వరలోనే గజిని సీక్వెల్.. స్టోరీ లైన్లో పెట్టిన స్టార్ డైరెక్టర్

తమిళ్ స్టార్ హీరో సూర్య(Surya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకే తమిళ హీరో అయినా.. టాలీవుడ్‌లో ఈ యాక్టర్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. గజిని(Ghajini), ఆరు, రక్తచరిత్ర, సెవెంత్ సెన్స్, మేము, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, యముడు, గ్యాంగ్, విక్రమ్‌తో పాటు ఇటీవల కంగువా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా 2005లో వచ్చిన గజిని సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక దీనిని హిందీలో 2008లో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించాడు. దీనిని మురుగదాస్(AR Murugadoss) స్టోరీ టేకింగ్‌తో ఈ సినిమా అప్పటివరకు బాక్సాఫీస్(Box Office) రికార్డులన్నింటినీ తిరగరాసింది.

మురుగదాస్ క్లారిటీతో ఫ్యాన్స్‌ ఖుషీ

తాజాగా ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నట్టు మురుగదాస్ వెల్లడించడంతో సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ ‘సికందర్(Sikinder)’ అనే హిందీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్నాడు. రంజాన్(Ramzan) సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విజయం మీదనే ‘గజిని-2(Ghajini 2) ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ‘సికందర్’ సక్సెస్ అయితేనే ఆమిర్ ఖాన్ మళ్లీ మురుగదాస్ మీద నమ్మకం పెట్టుకుని ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Ghajini 2 Official Trailer 2016 - Aamir Khan,Katrina Kaif,Ranveer Singh

సికిందర్ సక్సెస్‌పైనే గజిని-2

కానీ ఇద్దరూ తాము చేస్తున్న సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇప్పటివరకు ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని చెప్పాడు. ఆమిర్ ఖాన్ గత చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఘోరంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో… ఇప్పుడు అతను చేసే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. అందుకే మురుగదాస్ డెలివర్ చేసే ‘సికందర్’పై ఆయన కూడా ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘గజిని-2’ ఇప్పుడు మళ్లీ చర్చలోకి రావడం ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్. కానీ ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, ముందుగా ‘సికందర్’ విజయం సాధించాలి.

Aamir Khan Eyes Two Major Films: 'Ghajini 2' and a Superhero Flick with Lokesh Kanagaraj

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *