చెర్రీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. RC16 టైటిల్ రివీల్​కు ముహూర్తం ఫిక్స్

 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana)తో కలిసి ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. గురువారం రోజున (మార్చి 27వ తేదీ) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

చెర్రీ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజు

చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బర్త్ డేకు ఒక రోజు ముందే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ (RC16 First Look) రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు మార్చి 27వ తేదీన ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ ఫస్ట్​ లుక్ అండ్ టైటిల్ (RC16 Title) రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో చెర్రీ బ్యాక్ నుంచి ఫొటో కనిపిస్తోంది. చేతిలో సిగార్ పట్టుకుని మాస్ లుక్ లో చెర్రీ లుక్ అదిరిపోయింది.

RC16 టైటిల్ రివీల్​కు ముహూర్తం ఫిక్స్

ఇక ఈ సినిమా సంగతికి వస్తే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇటీవలే జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమెకు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించి లుక్ టెస్టు కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో చెర్రీకి, శివన్నకు మధ్య కుస్తీ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇక జగపతిబాబు, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *