
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma)కు ఏపీ సీఐడీ(AP CID) అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్జీవీ స్పందించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు(AP Highcourt)లో క్వాష్ పిటిషన్(Quash Petition) వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఈ కేసు పెట్టారని, సీఐడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవి RGV తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. CBFC ధ్రువపత్రం జారీ చేశాకే 2019లో “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” సినిమా విడుదల చేశామని స్పష్టం చేశారు. అయినా దాదాపు ఐదేళ్ల తర్వాత 2024లో కేసు నమోదు చేయడంలో అర్థం లేదని, సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, వారి తదుపరి చర్యలను కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
గత నెల 10వ తేదీనే నోటీసులు జారీ
కాగా 2019లో ఆయన తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు(Kamma Rajyamlo Kadapa Reddlu)’ మూవీపై అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బుధవారం (మార్చి 5) CID అధికారులు ఆర్జీవీకి నోటీసులు(Notice) జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు(Guntur) సీఐడీ అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాకుండా తన తరఫు లాయర్‌ను CID ఆఫీస్‌కు పంపించారు. తాజాగా మరోసారి నోటీసులు రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Chidambaram: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం సెన్సేషనల్ కామెంట్స్
పార్లమెంట్ వర్షాకాల సమావేశా(Parliament monsoon sessions)ల్లో భాగంగా నేడు (జులై 28) లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు విప్ జారీ చేయగా దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…