కొంతకాలంగా భారీ విజయాలు లేక బాలీవుడ్ చతికిలపడింది. సరైన స్క్రిప్టులు, ఆకర్షించే అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్దగా ఆదరించడంలేదు. ప్రత్యామ్నాయంగా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఈ వెలితిని కవర్ చేసేందుకు అక్కడి నిర్మాతలు, దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్తో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)తో ‘రామాయణ’ (Ramayana) సినిమాను తెరకెక్కిస్తున్నారు. నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న మూవీలో రాముడి క్యారెక్టర్లో రణ్‌బీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ (Yash), హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
ఫస్ట్ పార్ట్ రూ.900 కోట్లతో..
ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటినుంచి భారీ స్థాయిలో రానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ వార్తల జోరు పెరిగింది. మీడియాలో ఈ సినిమా రెండు పార్ట్ల బడ్జెట్‌ను వివరిస్తూ వచ్చిన వార్తలు ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా రెండు పార్ట్ల బడ్జెట్ ఏకంగా రూ.1600 కోట్లని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ రూ.900 కోట్లతో రానుందని.. సెకండ్ పార్ట్ రూ.700 కోట్లని సమాచారం (Ramayana Budget).
ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారట.
రామాయణ మేకర్స్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారట. ఫస్ట్ పార్ట్ కోసం ఎక్కువ సెట్స్ వేయనున్నారని, అందుకే పార్ట్2 కంటే దాని బడ్జెట్ ఎక్కువని హిందీ మీడియా తెలిపింది. సెకండ్ పార్ట్లో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే మిగిలి ఉంటాయట. ‘మల్హోత్రా టీమ్ ఈ సినిమాను ఎంతో భారీగా ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ముఖ్యంగా నేటితరానికి రామాయణాన్ని అందించాలనే ఆలోచనతో ముందుకుసాగుతోంది. విజువల్ వండర్‌గా ఇది రానుంది’ అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బడ్జెట్ నిజమైతే భారత్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ‘రామాయణ’ చరిత్ర సృష్టిస్తుంది.
As a True Hindu
I will not watch #Ramayana featuring Ranbir Kapoor
I believe someone who consumes beef big beef lover can’t do justice to the character of Lord Ram
I feel Sai Pallavi who referred Indian army as terrorists can’t play Sita Maa#BoycottBollywood#BoycottRamayana pic.twitter.com/LJZZFiP1lc
— United_Hindu (@Sree_Resmi_Nair) July 3, 2025






