Janvi Kapoor: జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ నిశ్చితార్థం.. ప్రియుడితో హ్యాపీ మోమెంట్స్ షేర్..

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్(Boni kapoor ) కుమార్తె అన్షులా కపూర్(Anshula Kapoor) తన నిశ్చితార్థం విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రోహన్ తక్కర్‌తో ఎంగేజ్‌మెంట్‌(Engagement Post ) జరిపినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తన వేలికి రోహన్ ఉంగరం వేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.

“మేమిద్దరం ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యాం. మూడేళ్ల క్రితం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో, అర్థరాత్రి 1:15 గంటల సమయంలో అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆ రాత్రి ఉదయం 6 గంటల వరకు మాట్లాడుకున్నాం. ఆ క్షణం ఎంతో మ్యాజికల్‌గా అనిపించింది. ప్రపంచమే ఆగిపోయినట్టుండిపోయింది. ఆ సమయంలోనే ఈ ప్రయాణం ఇక్కడి వరకూ వస్తుందని నాకర్థమయ్యింది. అతడి ప్రపోజల్‌కి ఓకే చెప్పా. నా బెస్ట్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ అన్షులా ఎమోషనల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

ఈ నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, బంధువులు, సినీ ప్రముఖులు అన్షులా, రోహన్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్షులా అన్న, నటుడు అర్జున్ కపూర్ స్పందిస్తూ, “మీ ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలి. లవ్ యూ గయ్స్… ఈరోజు అమ్మను ఎక్కువగా మిస్ అవుతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే జాన్వీ కపూర్(janhvi kapoor), ఖుషి కపూర్(Kushi Kapoor) సైతం “మా అక్క పెళ్లి చేసుకోబోతుంది” అంటూ కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Nestasia Home Decor (@nestasia.in)

రోహన్ తక్కర్(Rohan Thakkar) ఒక స్క్రిప్ట్‌రైటర్‌గా పని చేస్తున్నాడు. బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా శౌరీ కపూర్‌ కు ఆయనకు అర్జున్, అన్షులా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత శ్రీదేవిని వివాహం చేసుకుని జాన్వీ, ఖుషి పిల్లలు జన్మించారు. ఈ పిల్లలంతా ఒకరినొకరు ఎంతో అనుబంధంతో చూసుకుంటూ ఉంటారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *