
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ(Ramayana)’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) విడుదలైంది. ఈ రోజు (జులై 3) ఉదయం 11:30 గంటలకు దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ (PVX)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కత్తా, పూణే, కొచ్చిలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), కాజల్ అగర్వాల్ (మండోదరి), లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ) నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో పూర్తయింది. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణంలో, IMAXలో చిత్రీకరించబడుతున్న ఈ ఎపిక్ ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
the visuals, the animation, the bgm, the music, the small glimpse of ranbir and yash and the title card omg literally each and everything is absolutely perfect.
our truth, our history.
pure perfection 🔥#Ramayana
— sanil (@ohbaazigar) July 3, 2025