బాలీవుడ్‌లో మరో మేగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకొంటున్న రామాయణం (Ramayanam) సినిమా తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నితేష్ తివారీ(Nithin Tivari) దర్శకత్వంలో పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టులో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, కన్నడ రాక్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే, కాజల్ అగర్వాల్(Kajal Agarwal) మండోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం.
తాజాగా ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామాయణం సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. చిత్ర బృందం తాజా సమాచారం ప్రకారం, మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
This Generation’s Ram and Laxman #RanbirKapoor #RaviDubey #Ramayana pic.twitter.com/ViXwAKm3g3
— RK (@Varun_RK88) July 2, 2025
ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంగా రూపొందించిన గ్లింప్స్ వీడియోను 2025 జూలై 3న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అభిమానుల్లో ఈ గ్లింప్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






