రామాయణం షూటింగ్ కంప్లిట్.. వైరల్ అవుతున్నసెలబ్రేషన్స్ వీడియో.. రిలీజ్ డేట్ ఇదే!

బాలీవుడ్‌లో మరో మేగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకొంటున్న రామాయణం (Ramayanam) సినిమా తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నితేష్ తివారీ(Nithin Tivari) దర్శకత్వంలో పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టులో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, కన్నడ రాక్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే, కాజల్ అగర్వాల్(Kajal Agarwal) మండోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం.

తాజాగా ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామాయణం సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. చిత్ర బృందం తాజా సమాచారం ప్రకారం, మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంగా రూపొందించిన గ్లింప్స్ వీడియోను 2025 జూలై 3న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అభిమానుల్లో ఈ గ్లింప్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *