Smiley Face: ఆ రోజు ఆకాశంలో అద్భుతం.. సిద్ధంగా ఉండండి!

ఆకాశంలో అద్భుత దృశ్యం(A wonderful sight in the sky) కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు(Astronomers) చెబుతున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందట. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి చేరువగా రావడంతో ఆకాశంలో స్మైలీ ఇమేజ్(Smiley image) ఏర్పడనుందని తెలిపారు. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. శుక్రుడు, శని గ్రహాలు ప్రకాశవంతంగా మెరుస్తాయని, దీంతో ఎలాంటి పరికరాల అవసరం లేకుండా నేరుగానే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు.

టెలిస్కోప్, బైనాక్యులర్లతో చూస్తే..

టెలిస్కోప్(Telescope), బైనాక్యులర్ల(Binoculars)తో చూస్తే మరింత క్లారిటీగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు(Scientists) వెల్లడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్(Hyderabad)లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట, వరంగల్‌లో పాకాల సరస్సు లేదా భద్రకాళి ఆలయం(Bhadrakali Temple) ప్రాంతంలో వీక్షించవచ్చని అధికారులు చెబుతున్నారు. Apలో అయితే ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రదేశాల వద్ద ఈ అద్భుతాన్ని చూడొచ్చని చెప్పారు. ఆర్‌కె బీచ్(RK Beach), డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్(Dolphin Nose Viewpoint) వద్ద, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపంలోనూ చూడవచ్చన్నారు.

Related Posts

ISRO: PSLV-C61 ప్రయోగంలో టెక్నికల్ ఇష్యూ.. కారణాలు విశ్లేషిస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. PSLV-C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ల‌గా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో…

ISRO: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. ఇస్రో GSLV-F15 ప్రయోగం సక్సెస్

అంతరిక్ష ప్రయోగాల(In space experiments)లో ఇస్రో(ISRO) మరో మైలురాయిని అధిగమించింది. ఏపీలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి నేడు ప్రయోగించిన GSLV-F15 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇస్రో ఈ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ GSLV-F15…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *