
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో (Allu Arjun) కలిసి ఆమె నటించిన పుష్ప -2 (Pushpa 2) సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.1500 కోట్లకు సైగా వసూలు చేసింది. దీంతో ఈ సక్సెస్‌ను రష్మిక ఎంజాయ్ చేస్తోంది. అయతే రష్మికకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళస్టార్ దళపతి విజయ్‌కు (Vijay) తాను పెద్ద అభిమానినని రష్మిక ఇదివరకు చాలా సార్లు చెప్పి మురిసిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా విజయ్ నటించిన ‘గిల్లీ’ అని చెప్పారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ. తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘పోకిరి’కి రీమేక్ అని.. అందులోని ఓ పాట అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఆ పాటకు ఇప్పటివరకు ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ చేశానని చెప్పింది. అయితే ‘గిల్లి’ సినిమా మహేశ్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’కు రీమేక్. కానీ, రష్మిక ‘పోకిరి’ రీమేక్ అని చెప్పడంతో నెటిజన్లు ఆమెను ఆట పట్టిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ట్రోలింగ్ రావడంతో తన పొరపాటును రష్మిక (Rashmika) తాజాగా గుర్తించింది. ఓ ట్రోలింగ్ పోస్ట్‌కు రష్మిక తెలుగులో స్పందించింది. ‘అవును. సారీ గిల్లీ సినిమా ఒక్కడుకు రీమేక్ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. పోకిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్ చేసేస్తారని కూడా అనుకున్నా. నిజంగా సారీ.. నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే’ అంటూ ఫన్నీ ఎమోజీలను జతచేసింది. రష్మిక ప్రస్తుతం కుబేరా, సికందర్, ఛావా, ది గర్లఫ్రెండ్ చిత్రాల్లో ఆమె దక్షిణాదిలో, బాలీవుడ్లో బిజీగా గడుపుతోంది.