పోటీ కేవలం క్రీడలు, రాజకీయాల్లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలోనూ ఉంటుంది. ఏటా డజన్ల కొద్దీ కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. మరోవైపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న నటులూ ఉన్నారు. వెరసీ సినీ పరిశ్రమ(Cine Industry)లో ఎవరు ది బెస్ట్ నటుడు, ఎవరి ది బెస్ట్ నటి(Who is the best actress?) అనే సందేహం, ఆసక్తి అటు అభిమానుల్లోనూ ఉంటుంది. తాజాగా ఇలాంటి విషయమై బాలీవుడ్(Bollywood)లోనూ ఓ చర్చకు దారితీసింది. B-టౌన్‌లో ఎవరు బెస్ట్ హీరోయిన్ అనే దానిపై ఫ్యాన్స్ తలోమాట చెబుతున్నారు. మరీ బాలీవుడ్, టాలీవుడ్‌లో ఎవరు ఉత్తమ నటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బెంగళూరు భామల హవా
ప్రస్తుతం బాలీవుడ్‌లో బెంగళూరు(Bangalore) భామల హవా నడుస్తోంది. వాళ్లెవరో కాదు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna). ఈ ఇద్దరు కన్నడ భామలు ఇప్పుడు బాలీవుడ్‌కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బాలీవుడ్‌లో టాప్ 5 లిస్ట్ తీస్తే దీపికా పదుకొణె తప్పక ఉంటుంది. ఇక మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai) రేర్‌గా సినిమాలు చేయడం, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హాలీవుడ్‌కి వెళ్లిపోవడంతో దీపిక మరింత షైన్ అయ్యింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ లాంటి భామలున్నా? వాళ్లను మించిన క్రేజీ బ్యూటీగా దీపికకు పేరుంది.

బాలీవుడ్, టాలీవుడ్‌లో రెండింటిలోనూ..
అయితే ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలోనూ రష్మిక మందన్న(Rashmika Mandanna) హవా నడుస్తోంది. ‘పుష్ప, పుష్ప-2’తో పాన్ ఇండియా(Pan-india) లెవెల్లో వెలుగులోకి వచ్చింది. పైగా ‘యానిమల్(Animal)’తోనూ మరింత ఫేమస్ అయింది. స్టార్ హీరోలే రష్మికతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మూడేండ్ల క్రితం ‘గుడ్ బై(Good Bye)’ సినిమాతో బాలీవుడ్‌లోకి లాంఛ్ అయిన రష్మిక.. సోలోగానే తన సత్తా చాటులోంది. తాజాగా ‘ఛావా(Chhawa) ‘లోనూ నటించింది. శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో ఏసుబాయిగా మెప్పించనుంది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ హవా కొనసాగుతోంది. ఆమె తర్వాతే శ్రీలీల, సమంత, అనుష్క, మీనాక్షి చౌదరి వంటి వారు క్యూలో ఉన్నారని పలు రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది.








