Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు.. తాజాగా మరో హిందీ సినిమాతో సక్సెస్ సాధించింది. రష్మిక హిందీలో నటించిన ‘ఛావా(Chhaava)’ మూవీ వాలంటైన్స్ డే కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. అయితే ఆమె ఈ మూవీ ప్రమోషన్స్‌(Promotions)లో భాగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు వివాదాన్ని కొనితెచ్చాయి. ఇంతకీ రష్మిక ఏం చేసిందో తెలుసుకుందామా..

నేషనల్ క్రష్ రష్మిక మరో వివాదంలో చిక్కుకుంది. ‘ఛావా’ ప్రమోషన్స్‌(Chhaava Promotions)లో భాగంగా తాను హైదరాబాద్‌(Hyderabad) నుంచి వచ్చానని చెప్పిందీ అమ్మడు. “నేను హైద‌రాబాద్ నుంచి వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది” అని స్పీచ్ ఇచ్చింది. ర‌ష్మిక ఇలా అన‌డం ఇప్పుడు క‌ర్ణాట‌క‌(Karnataka)లో చ‌ర్చ‌కు దారితీసింది.

ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని డిమాండ్

దీంతో ఆమె వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతూ న‌టిపై కన్నడిగులు క‌న్నెర్ర చేస్తున్నారు. సొంతూరు విరాజ్‌పేట‌(Viraajpeta) గురించి చెప్పకపోవడాన్ని క‌న్న‌డ వాసులు సోషల్ మీడియా(SM)లో తప్పుపడుతున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో చెప్పాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇప్ప‌టికే కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల కూడా కన్నడిగులు(Kannadigas) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *