PBKS vs RCB: రివేంజ్ తీర్చుకుంటుందా? టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఐపీఎల్ 2025లో ఈరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ సొంతగడ్డపై ఆ జట్టును 95 పరుగులపై చిత్తు చేసిన పంజాబ్ మరోసారి అదే జట్టుతో తమ సొంతగడ్డపై ఆడుతోంది. ఈ మేరకు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో బెంగళూరు కెప్టెన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ తెలిపాడు. లైయిమ్ లివింగ్‌స్టోన్ స్థానంలో షెఫర్డ్ జట్టులోకి వచ్చాడు. అటు పంజాబ్ మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండానే ఆడుతోంది. కాగా గత మ్యాచులో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది.

Image

ఓవరాల్‌గా పంజాబ్‌దే పైచేయి

ఇక పంజాబ్, ఆర్సీబీ రెండు జట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడ్డాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలయింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 34 మ్యాచ్‌లు ఆడాయి. అందులో ఆర్సీబీ 16 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది.

తుది జట్లు ఇవే..

PBKS (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), జోష్ ఇంగ్లిస్ (Wk), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

RCB (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(C), జితేష్ శర్మ(Wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *