పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఫౌజీ(Fouji)’. ఈ సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్(Prabhas New Look)లో కనిపించి అభిమానుల(Fans)ను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, సెట్స్ నుంచి లీకైన ఓ ఫొటో సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, షర్ట్‌తో క్లాసిక్, స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ లుక్‌ను అభిమానులు ‘వింటేజ్ ప్రభాస్(Vintage Prabhas)’గా అభివర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఫౌజీ’ సినిమా రూ.600కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోందని ఇన్‌సైడ్ వర్గాలు వెల్లడించాయి.

కారైకుడిలో 20 రోజుల షెడ్యూల్
మైత్రీ మూవీస్ బ్యానర్(Mythri Movies banner)పై నిర్మితమవుతున సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మధురై సమీపంలోని కారైకుడిలో 20 రోజుల షెడ్యూల్‌లో దేవీపురం అనే అగ్రహారం నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరించారు.ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మిథున్ చక్రవర్తి(Mithun Chakravarthy), అనుపమ్ ఖేర్, ఇమాన్వీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Darling Massiveness 🖤🔥#Prabhas𓃵 #Prabhas #Fouji pic.twitter.com/aEooLcClvw
— UDAY (@Meet_4_Uday) July 2, 2025
కాగా ఈ చిత్రం, జైలు నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలతో సహా భావోద్వేగ, యాక్షన్ ఎలిమెంట్స్(Action elements)తో నిండి ఉంటుందని అంచనా. కాగా ప్రభాస్ నయా లుక్‌తో ‘బాహుబలి’, ‘కల్కి 2898 AD’ వంటి చిత్రాల తర్వాత మరోసారి తన వైవిధ్యమైన నటనతో అభిమానులను అలరించనున్నారని భావిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.






