RBI Repo Rate: లోన్లు తీసుకున్నవారి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రెపోరేటు

బ్యాంకు లోన్లు(Bank Loans) తీసుకున్న వారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేటు(Repo rate)ను భారీగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు(Basis Points) తగ్గించడంతో కొత్త రేటు 5.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల లాంగ్ టర్మ్ లోన్లు, హోమ్ లోన్లు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్లు తీసుకున్న వారికి EMIల భారం తగ్గే అవకాశం ఉంది.

ఏకగ్రీవ నిర్ణయంతో ఆమోదం..

ప్రతి 2 నెలలకోసారి జరిగే MPC సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు RBI వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపున(Interest rate cuts)కు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. RBI రెపోరేట్ తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఉదయం ఫ్లాటుగా ప్రారంభమైన బ్యాంకింగ్, NFBC, పలు ఆటో షేర్లు ఒక్కసారిగా గ్రీన్‌లోకి వచ్చేశాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *