CM Revanth: తెలంగాణలో రేవంత్ మార్క్.. సీఎంగా ఏడాది పాలన పూర్తి

తెలంగాణ(Telangana)లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) పాలనకు నేటితో ఏడాది పూర్తయింది. 2023 DEC 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. డిసెంబర్ 7వ తేదీన హైదరాబాద్ వేదికగా రేవంత్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం(Oath Taking) చేశారు. 9వ తేదీన కాంగ్రెస్ సర్కార్(Congress Govt) కొలువుదీరింది. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలెంటో ఓ లుక్కేద్దాం…

తొలి సంతకం దానిపైనే

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. CM రేవంత్ రెడ్డి తొలి సంతకం(First Sign) కూడా ఆ స్కీమ్‌పైనే చేశారు. అంతేకాదు… సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. పథకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. పథకాల వర్తింపున కోసం వివరాలను సేకరించింది. వివరాలను ఆన్‌లైన్(Online) కూడా చేసింది.

CMగా రేవంత్ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలివే..

☛ ఆరు గ్యారెంటీల అమలుపై CM రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.
☛ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు.
☛ రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్‌ను పట్టాలెక్కించారు. 4 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు.
☛ గృహా జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. దీనికింద 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు.
☛ కొత్తగా DSC నోటిఫికేషన్ ఇచ్చి నియామకపత్రాలను అందజేశారు.
☛ గ్రూప్ 1, 2 పరీక్షలను పూర్తి చేశారు. ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
☛ హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా HYDRAను ఏర్పాటు చేసింది.
☛ ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన, ప్రణాళికలు సిద్ధం చేశారు.
☛ గురుకులాల్లో డైట్ ఛార్జీలను పెంచారు.
☛ కుల గణన సర్వేను నిర్వహించారు.
☛ 400,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. త్వరలోనే అర్హులను గుర్తించనున్నారు.
☛ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారు.
☛ ప్రజా వాణీ కార్యక్రమంలో భాగంగా 500,000 ఫిర్యాదులను స్వీకరించారు.
☛ అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించారు.
☛ TS నుంచి TGకి వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్పు చేశారు.
☛ తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారు.
☛ మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
☛ స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచే కోర్సులను కూడా ప్రారంభించారు.
☛ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *