తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో నల్గొండ పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఇవాళ ఆయన నల్లొండ జిల్లా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో CM మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ రైతుల(Formers) కృషిని ఎన్నటికీ మరువలేమని కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారి(Srikantha chary) నల్గొండకు చెందిన వ్యక్తేనని గుర్తుచేశారు. KCR పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో కంటే.. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అధికంగా నష్టపోయిందని విమర్శించారు.
అది కేసీఆర్ స్థాయికి మంచిదికాదు
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్(Ex CM KCR)పై విమర్శల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ‘కేసీఆర్ గెలిస్తే అధికారం చలాయిస్తాం.. లేకపోతే ఫామ్‌హౌస్(Farmhouse)కే పరిమితం అవుతామనే విధానం సరికాదన్నారు. మేం గెలిచినా.. ఓడినా ప్రజల్లోనే ఉన్నామని గుర్తుచేశారు. మా ఎమ్మెల్యేలను లాక్కున్నా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఏడాది గడుస్తున్నా KCR ఒక్కసారైనా ప్రజల ముందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించారా? అని నిలదీశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే కుగింపోవడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు.
ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ఇక రైతులనుద్దేశించి సీఎం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ(Runamafi) చేశామని గుర్తుచేశారు. ఆనాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరే అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరి పండిచిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తోందని అన్నారు. పైగా ధాన్యం అమ్మిన మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామన్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని నిరూపించామని చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) నిధులు వేస్తామని మరోస్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎవరి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు.






