
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి డాక్టర్ (RG Kar Hospital Case) హత్యాచార కేసులో నేడు తీర్పు వెలువడనుంది. బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెల్లడించనుంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది.
మరణశిక్ష విధించాలి
డీఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను సీబీఐ (CBI).. కోర్టు ముందుంచింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని కోర్టును కోరింది. మరోవైపు సంజయ్ రాయ్ తరఫు న్యాయవాదులు మాత్రం తమ అతడు నిర్దోషి అని, తమ క్లయింట్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. జనవరి 9వ తేదీన ఈ కేసులో వాదనలు పూర్తి కాగా.. ఇవాళ తీర్పు వెలువడనుంది.
నిందితుడి ప్రవర్తనలో మార్పు
మరోవైపు తీర్పు తేదీ దగ్గరపడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ (Sanjay Roy) ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని.. నిందితున్ని ప్రత్యేక సెల్‌లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిసింది. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
దర్యాప్తు సగమే జరిగింది
మరోవైపు హత్యాచార కేసులో (Kolkata Doctor Case Update) తీర్పు రానున్న వేళ ఈ కేసులో దర్యాప్తు సగమే జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. “సంజయ్ రాయ్ తప్పు చేశాడు. కోర్టు అతడికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుంది. అయితే ఇతర నేరస్థుల మాట ఏంటి?” అని బాధితురాలి తల్లి ప్రశ్నించారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…