Telangana Election: బర్రెలక్కను మహాత్మతో పోల్చిన RGV.. మేధావులతో పాటు సెలబ్రిటీల మద్దతు

తనపై దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బర్రెలక్క కన్నీటి పర్యంతమయ్యారు. దాడి తర్వాత బర్రెలక్కకు నియోజకవర్గం దాటి రాష్ట్రం, దేశం నలుమూల నుంచి మద్దతు పెరుగుతూ వచ్చింది. ఇందులో సామాన్య ప్రజలతో పాటు మేధావులు, సెలబ్రిటీ, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు.

కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క శిరీషకు అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇప్పటికే బర్రెలక్క చాలా ఫేమస్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఒంటరి పోరు చేస్తున్న బర్రెలక్కకు స్థానికంగా మద్దతు లభించడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బర్రెలక్కకు రోజు రోజుకు ఆదరణ పెరగుతుండటంతో ప్రత్యర్థి వర్గాల తట్టుకోలేక దాడి కూడా జరిగింది. దీంతో బర్రెలక్క తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు శిరీషకు 2+2 సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో నిర్విరామంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ.. తన మాటలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

సెన్సేషన్‌గా మారిన బర్రెలక్కకు తాజాగా వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ సైతం అండగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా బర్రెలక్కను నేటి తరం మహాత్మా గాంధీతో పోల్చారు రాంగోపాల్ వర్మ. అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ మొదలుపెట్టిన సత్యాగ్రహ ఉద్యమాన్ని, బర్రెలక్క ఉద్యమం రెండు ఒకేలా ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేశారు. RGV నే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతరులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

Share post:

లేటెస్ట్