
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధర(Gold Rates) పెరిగింది. ఇటీవల వరుసగా తగ్గి ఊరట కల్పించినప్పటికీ.. మళ్లీ అక్కడి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్(Silver) రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశీయంగా చూస్తే హైదరాబాద్(hyderabad) నగరంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లపై రూ. 750 పెరగడంతో ఇప్పుడు రూ. 93,700 కి చేరింది. ఇది కిందటి రోజు మాత్రం రూ. 50 ఎగబాకింది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 820 పెరగడంతో 10 గ్రాములు రూ. లక్ష మార్కుకు చేరింది. దీంతో మరోసారి రూ. 1,02,220గా నమోదైంది. దీంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,23,000గా ఉంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయంగా అనిశ్చితి
కాగా కొంతకాలంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లో ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు ఆందోళన కలిగించాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా సుంకాల్ని ప్రకటించారు. ఇలాంటి అనిశ్చితి సమయంలో.. బంగారం సురక్షిత పెట్టుబడి(Investment) సాధనంగా పనిచేస్తుందన్న సంగతి తెలిసిందే.