టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో సత్తా చాటాడు. ఇంగ్లండ్(England)తో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు సెంచరీలు(Two Centuries) చేయడంతో పంత్ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఒక్క స్థానాన్ని అధిగమించి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే పంత్ 801తో కెరీర్ టాప్ రేటింగ్ పాయింట్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(889) అగ్రస్థానంలో ఉండగా.. అతని కంటే పంత్(Pant) కేవలం 88 రేటింగ్ పాయింట్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు.
Rishabh Pant’s steady rise in Test cricket continues 📈
Travis Head breaks into the top 10 👊
Josh Hazlewood inching closer to the top three 👌The latest ICC Men’s Player Rankings are here 🏏
More ➡️ https://t.co/8VqTWrxpSC pic.twitter.com/k9kZ9SSVix
— ICC (@ICC) July 2, 2025
బౌలింగ్‌లో బూమ్రాదే అగ్రస్థానం
ఇక, భారత్ తరపున పంత్ కంటే జైస్వాల్(4వ ర్యాంక్) ముందు వరుసలో ఉన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ఒక్క స్థానం కోల్పోయి 21వ ర్యాంక్‌కు పడిపోయాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) టెస్టుల్లో నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. జడేజా(Jadeja) కూడా నం.1 ఆల్‌రౌండర్ హోదాను కాపాడుకున్నాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) టాప్ ప్లేస్‌లో ఉండగా, సౌతాఫ్రికా(South Africa) రెండు, ఇంగ్లండ్(England) మూడో స్థానంలో నిలిచాయి. ఇక టీమ్ఇండియా(Team India) 4వ ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌ను నెగ్గితే భారత్ ర్యాంకు మెరుగుపడనుంది.
/newsdrum-in/media/media_files/2025/01/09/ddTYjFRaPg3mbLUuYogH.jpg)






