రిషబ్ పంత్ (Rishabh Pant) పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు పోరాట యోధుడు గుర్తుకువస్తాడు. అతడి ఆటలో ఎంత వైవిధ్యం ఉంటుందో మాటల్లో కూడా అంతే చలాకీతనం ఉంటుంది. అందుకే ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కారు యాక్సిడెంట్ ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ మరింత దృఢంగా తయారయ్యాడు. గేమ్ లో పరిణితి పెరిగింది. కాగా ఇతర ఆటగాళ్లను ఆట పట్టించడంలో అదే అల్లరి తనం కొనసాగుతోంది.
అడిలైడ్ వేదికగా (Adelaide Test) జరిగిన రెండో టెస్టు మూడో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ అడమ్ గిల్ క్రిస్ట్ ను ఆట పట్టించాడు. చిన్నప్పుడు వెనక నుంచి వచ్చి కళ్లు మూసి ఎవరో గుర్తు పట్టండి అన్నట్లు గిల్లీని వెనక నుంచి వచ్చి కళ్లు మూసేశాడు. ఇప్పుడు చెప్పు ఎవరో చూద్దాం అన్నాడు. దీంతో కాసేపు తడబడిన గిల్ క్రిస్ట్ చివరకు అతి కష్టం మీద వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే రిషబ్ పంత్ ను కౌగిలించుకున్నాడు. ఇదంతా కెమెరాలో రికార్డయింది. దీంతో కామెంటరీ బాక్స్ లో ఉన్న ఇషా, రవి శాస్త్రి, బ్రెట్ లీ,(Brett Lee) అందరూ దీని గురించి చర్చించుకున్నారు.
రిషబ్ పంత్ ప్రేమ కలిగిన వ్యక్తి అని అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న మంచి మనసున్న వాడని రవిశాస్త్రి అన్నాడు. గత బోర్డర్ –గవాస్కర్ సిరీస్ లో(Border Gavaskar Trophy) కూడా అప్పటి కెప్టెన్ టిమ్ ఫైన్, బౌలర్ ఫ్యాట్ కమిన్స్(Pat Cummins) ను ఆట పట్టించాడు. దీంతో ఏకంగా అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని కూడా రిషబ్ పంత్ ను ప్రత్యేకంగా పలకరించాడు. నువ్వే కదా మా ఆటగాళ్లను
స్లెడ్జ్ చేస్తున్నావ్ అని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కాగా అడిలైడ్ టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి పాలైంది. నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కడే రెండు ఇన్సింగ్స్ లలో 42 పరుగులతో ఆకట్టుకోగా మిగతా బ్యాటర్లంతా పెయిలయ్యారు. కాగా ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ భారీ సెంచరీతో రాణించగా.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఫస్ట్ ఇన్సింగ్స్ లో 6 వికెట్లు, కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ రెండో ఇన్సింగ్స్ లో 5 వికెట్లను తీసి ఇండియా బ్యాటర్లపై ఆధిపత్యం కనబరిచారు. దీంతో సిరీస్ 1–1తో సమంగా నిలిచింది. ఇంకా మూడు టెస్టు మ్యాచులు ఉన్న సమయంలో మూడింట్లో గెలిస్తేనే భారత్ కు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించే అవకాశం వస్తుంది.
Wholesome moment 🥹❤️😇
Adam Gilchrist and Rishabh Pant #RishabhPant #CricketTwitter#INDvsAUSpic.twitter.com/r6MV5GA357— Riseup Pant (@riseup_pant17) December 8, 2024








