ఇంగ్లండ్ సిరీస్‌లో ఉన్న టీమ్ఇండియా(Team India)కు బిగ్ షాక్ తగిలింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నిన్నటి (జులై 23) నుంచి మాంచెస్టర్(Manchestar)లో నాలుగో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 264/4 రన్స్ చేసింది. అయితే ఈ మ్యాచులో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్(Rishabh Pant) ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు( ruled out of Test serie). పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. క్రిస్ వోక్స్(Chris Woaks) వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అతని కుడి పాదంపై బంతి తగిలింది.

బీసీసీఐ మరో ప్లేయర్‌ను తీసుకుంటుందా?
ఈ గాయం కారణంగా అతను తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. ఫీల్డ్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత గోల్ఫ్-స్టైల్ బగ్గీ (Golf-style buggy)లో మైదానం వీడాడు. అనంతరం పంత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. దీంతో పంత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ (Pant ruled out of England Test series) నుంచి తప్పుకొవాల్సి వచ్చింది. మరి అతని స్థానంలో బీసీసీఐ(BCCI మరోక ప్లేయర్‌ను తీసుకుంటుందా? లేకపోతే ఇప్పటికే జట్టులో ఎంపిక చేసిన వారికి చోటు కల్పిస్తుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
🚨 PANT OUT FOR 6 WEEKS. 🚨
– Rishabh Pant advised a 6 week rest for a fractured toe. (Express Sports).#pant pic.twitter.com/Smssj1s5gV
— ThreadSutra🧵 (@itsShl) July 24, 2025






