రీతూ వర్మ (Ritu Varma), సూర్య వశిష్ఠ ప్రధానపాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’(Devika & Danny). రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) వేదికగా డైరెక్టు జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ‘ఒకరు తన చేయి పట్టుకుంటే.. మరొకరు తన మనసు గెలిచారు..’ అనే ఆసక్తికర క్యాప్షన్‌తో ట్రైలర్(Devika & Danny trailer)ను పంచుకుంది. శివ కందుకూరి, సుబ్బరాజు, సోనియా సింగ్, శివ కందుకూరి, హర్ష తదితరులు నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను మీరూ చూసేయండి..






